Share News

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:53 AM

సూర్యాపేట మండలం బాలెంల స్టేజి వద్ద వాకింగ్ చేస్తున్న ముగ్గురిని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం సైదులు అక్కడికక్కడే మృతి చెందగా, నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడిన గొల్ల జానయ్యను సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Suryapet Fatal Road Accident

సూర్యాపేట జిల్లా, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట మండలం బాలెంల స్టేజి వద్ద వాకింగ్ చేస్తున్న ముగ్గురిని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం సైదులు అక్కడికక్కడే మృతి చెందగా, నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడిన గొల్ల జానయ్యను సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ అనంతరం ఆగకుండా బొలెరో వాహనం డ్రైవర్ వెళ్లిపోగా.. అతడిని మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై త్రుటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం త్రుటిలో తప్పింది. మొదటగా ఓ కారు అదుపు తప్పి స్థంభాన్ని ఢీకొనగా, వెనుక వస్తున్న ఐదు కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను తొలగించి పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ - 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి రాష్ట్రాల సహకారం అవసరం: సీఎం రేవంత్

నల్లగొండ జిల్లాకు అధికారులు నీళ్లు రాకుండా చేస్తున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వల.. గురూజీపై కేసు.!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 09:28 AM