Share News

కోనేటి వెంకటరాజు బెయిల్‌ రద్దు చేయండి

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:37 AM

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో హోంగార్డు కోనేటి వెంకటరాజుకు విజయవాడ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిట్‌ అడిషనల్‌ ఎస్పీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కోనేటి వెంకటరాజు బెయిల్‌ రద్దు చేయండి

  • గాదె సాయికృష్ణ కేసులో హైకోర్టులో సిట్‌ పిటిషన్‌

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో హోంగార్డు కోనేటి వెంకటరాజుకు విజయవాడ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిట్‌ అడిషనల్‌ ఎస్పీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో సీసీటీవీ ఫుటేజ్‌ మాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న్డ కోనేటి వెంకటరాజు(ఏ7)కు బెయిల్‌ మంజూరు చేస్తూ గతనెల 29న విజయవాడ 8వ అదనపు జిల్లా జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ సిట్‌ అడిషనల్‌ ఎస్పీ వేసిన పిటిషన్‌ గురువారం విచారణకు రాగా, హోంగార్డు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. అదనపు వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:37 AM