అవినీతికి కేరాఫ్.. విద్యుత్ సెక్షన్లు!
ABN , Publish Date - Oct 16 , 2026 | 09:48 AM
అక్రమాలకు చెక్ పెట్టేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో కొంతమంది ఇంజనీర్ల తీరు మారడం లేదు.
ఏసీబీకి పట్టుబడినా మారని కొందరి తీరు
తాజాగా రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన ఏఈ
హైదరాబాద్ సిటీ: అక్రమాలకు చెక్ పెట్టేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో కొంతమంది ఇంజనీర్ల తీరు మారడం లేదు. అడిగినంత ఇవ్వకపోతే కొత్త కనెక్షన్ల జారీలో కొర్రీలు పెడుతూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. మాదన్నపేట సెక్షన్లో 6 విద్యుత్ మీటర్ల మంజూరుకు అసిస్టెంట్ ఇంజనీర్ రాకేష్ రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ సౌత్, సెంట్రల్, సికింద్రాబాద్, మేడ్చల్, సరూర్నగర్, రాజేంద్రనగర్, సైబర్సిటీ సర్కిళ్లలోని పలు సెక్షన్లలో కొంతమంది ఏఈలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
కుత్బుల్లాపూర్ గాజులరామారం సెక్షన్లో ఓ ఏఈ ఎస్టిమేషన్లు లేకుండా ప్యానల్బోర్డు, మీటర్లు జారీచేస్తూ ఆక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. చార్మినార్, బేగంబజార్ డివిజన్లలో రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి చెల్లించిన బిల్లులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
పర్యటించని చీఫ్ ఇంజనీర్లు
క్యూర్ పరిధి మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లు ఉండగా ఇందులో ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదనే విమర్శలున్నాయి. విద్యుత్సరఫరా, కనెక్షన్ల జారీలో కీలకమైన ఆపరేషన్ విభాగం డైరెక్టర్ సైతం క్షేత్రస్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టరనే విమర్శలున్నాయి. సీఎండీ క్షేత్రస్థాయికి వస్తే కానీ ఈ సీఈలు క్షేత్రస్థాయికి రావడం లేదనే ఆరోపణలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్
బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News