Share News

నేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్‌

ABN , Publish Date - Oct 16 , 2026 | 07:17 AM

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహనసేవ శుక్రవారం తిరుమలలో జరగనుంది.

నేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్‌
Tirumala Tirupati

తిరుపతి: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహనసేవ శుక్రవారం తిరుమలలో జరగనుంది. ఇందుకు లక్షలాది మంది భక్తులు తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉన్నందున భక్తుల రాకపోకలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ట్రాఫిక్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్సీ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ‘శుక్రవారం తిరుమలకు చేరుకునేందుకు ఆర్టీసీ, టీటీడీ వాహనాలు మినహా ప్రైవేటు వాహనాలకు పూర్తిగా అనుమతి ఉండదు.


అలాగే గురువారం రాత్రి 9 నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు తిరుమల ఘాట్‌లో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడకుండా బాలాజీ లింక్‌ బస్టాండు, నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌, ఎస్వీ వైద్య కళాశాల, ఇస్కాన్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశాం. యాత్రికుల బస్సులకు వివిధ రూట్‌లలో వచ్చే వారికి అనుగుణంగా జూపార్కు రోడ్డులోని దేవలోక్‌, ట్రిడెంట్‌, మ్యాంగో మార్కెట్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశాం. ఫోర్‌ వీలర్‌ వాహనాల కోసం భారతీయ విద్యాభవన్‌, అలిపిరి లింక్‌ బస్టాండు, ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌండ్‌లలో పార్కింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి.


అన్ని పార్కింగ్‌ ప్రదేశాల నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమలకు చేరుకునేందుకు అవసరమైన ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచుతాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి పార్కింగ్‌ ప్రదేశంపై అవగాహన కల్పించడానికి సోషల్‌ మీడియా, ఫ్లెక్సీల ద్వారా పార్కింగ్‌ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. భక్తుల భద్రతా, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అమలు చేస్తున్న ట్రాఫిక్‌ నిబంధనలను, మళ్లింపులను ప్రయాణికులు గమనించి సహకరించాలి’ అని ఎస్పీ ఆ ప్రకటనలో కోరారు.


రుడసేవ రోజున తిరుపతికి వచ్చే బస్సుల దారి మళ్లింపు ఇలా..

  • చిత్తూరు, మదనపల్లె నుంచి వచ్చే బస్సులను కాలూరు క్రాస్‌, ఆర్సీపురం జంక్షన్‌ మీదుగా గరుడ ఫ్లైఓవర్‌ ద్వారా ఆర్టీసీ బస్టాండుకు చేరుకోవాలి.

  • చెన్నై, పుత్తూరు నుంచి వచ్చే బస్సులను సింధు ఫ్లైఓవర్‌, తనపల్లె జంక్షన్‌ మీదుగా గరుడ ఫ్లైఓవర్‌ ద్వారా ఆర్టీసీ బస్టాండుకు చేరుకోవాలి.

  • కడప, శ్రీకాళహస్తి వైపు నుంచి తిరుపతికి వచ్చే బస్సులు రమణ విలాస్‌ జంక్షన్‌, గాజులమండ్యం సర్కిల్‌, తనపల్లె జంక్షన్‌ మీదుగా గరుడ ఫ్లై ఓవర్‌ ద్వారా ఆర్టీసీ బస్టాండుకు చేరుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

మొక్కజొన్న మాటున గంజాయి సాగు!

బలిమెల నీటి వినియోగంపై సమీక్ష

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 07:17 AM