బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:11 AM
తెలంగాణలోని క్యూర్ (టీసీయూఆర్) పరిధిలో 14 బార్లు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 27 బార్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు శుక్రవారం లక్కీ డ్రా తీయనున్నట్లు ఎక్సైజ్ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని క్యూర్ (టీసీయూఆర్) పరిధిలో 14 బార్లు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 27 బార్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు శుక్రవారం లక్కీ డ్రా తీయనున్నట్లు ఎక్సైజ్ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొంది. క్యూర్ పరిధిలో 14 బార్ల ఏర్పాటు కోసం 4,251దరఖాస్తులు, మిగతా 37బార్ల కోసం 4,519 దరఖాస్తులొచ్చాయని వివరించింది. క్యూర్తోపాటు రాష్ట్రంలో శుక్రవారం మధ్యాహ్నం 11 గంటలకు దరఖాస్తు దారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు.