Share News

స్వీట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు.. 2,480 కిలోల ఆహార పదార్థాల సీజ్

ABN , Publish Date - Oct 16 , 2026 | 10:10 AM

హైదరాబాద్‌లోని స్వీట్‌ షాపులు, డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా నాసిరకమైన ఉత్పత్తులను విక్రయిస్తున్న డెయిరీ సంస్థలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

స్వీట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు.. 2,480 కిలోల ఆహార పదార్థాల సీజ్
Food Safety Raids

హైదరాబాద్, అక్టోబర్ 16: నగరంలోని స్వీట్‌ షాపులు, డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్(TG SAFE) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా నాసిరకమైన ఉత్పత్తులను విక్రయిస్తున్న డెయిరీ సంస్థలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈరోజు(శుక్రవారం) జీడిమెట్లలోని భాగ్యలక్ష్మి స్వీట్స్, దేశీ డెయిరీ స్వీట్స్, బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యశోద డెయిరీ ప్రొడక్ట్స్, మధుర డెయిరీ ప్రొడక్ట్స్ యూనిట్‌లపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో షాపుల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని అధికారులు గుర్తించారు.


సరైన నిల్వ వసతులు లేకపోవడంతో పాటు, ఉష్ణోగ్రత నియంత్రణ పాటించకుండా డెయిరీ ప్రొడక్ట్స్‌ను నిల్వ చేస్తున్నట్లు దాడుల్లో బయటపడింది. వంటగదుల్లో ఎలుకలు, ఈగలు ఉండటాన్ని గుర్తించిన టీజీ సేఫ్ అధికారులు... ఆ షాపుల ఎఫ్ఎస్‌ఎస్ఏఐ(FSSAI) లైసెన్సులను సస్పెండ్ చేశారు. అలాగే లైసెన్సులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డెయిరీ యూనిట్లను సీజ్ చేశారు. తక్షణమే దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాడుల్లో భాగంగా దాదాపు 3.78 లక్షల విలువైన 2,480 కిలోల ప్రమాదకర, అపరిశుభ్ర ఆహార పదార్థాలను సీజ్ చేసిన అధికారులు.. వాటిని ధ్వంసం చేశారు.


ఇవి కూడా చదవండి...

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

మూలా నక్షత్రం వేళ.. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 10:54 AM