మణిపాల్‌లో క్లిష్టమైన రీడూ కార్డియాక్ సర్జరీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:34 AM
టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్తో పాటు ఆబ్సెంట్ పల్మనరీ వాల్వ్ సిండ్రోమ్‌తో జన్మించిన 27 ఏళ్ల యువకుడికి ..
27 ఏళ్ల యువకుడికి పునర్జన్మ
తాడేపల్లి టౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్తో పాటు ఆబ్సెంట్ పల్మనరీ వాల్వ్ సిండ్రోమ్‌తో జన్మించిన 27 ఏళ్ల యువకుడికి మణిపాల్ హాస్పిటల్స్‌లో అత్యంత క్లిష్టమైన ‘రీడూ కార్డియాక్ సర్జరీ’ గురువారం విజయవంతంగా నిర్వహించారు. 10 ఏళ్ల వయసులో అతనికి సర్జరీ చేసి 17 ఎం.ఎం మెకానికల్ పల్మనరీ వాల్వ్ అమర్చారు. అయితే బరువు 130 కిలోలకు పెరగడంతో ఆ వాల్వ్ సరిపోక పేషెంట్ ప్రోస్థసిస్ మిస్‌మ్యాచ్ సమస్య తలెత్తింది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మణిపాల్ కార్డియాక్ సర్జరీ బృందం పాత 17 ఎం.ఎం. వాల్వ్ తొలగించి 25 ఎం.ఎం. మెకానికల్ పల్మనరీ వాల్వ్ అమర్చారు.
ఆర్.వీ.వో.టీ., పల్మనరీ ఆర్టరీని పునర్నిర్మించారు. అలాగే అయోర్టిక్ రూట్‌ను విస్తరించి 25 ఎం.ఎం మెకానికల్ అయోర్టిక్ వాల్వ్ అమర్చామని వైద్యులు డాక్టర్ దిలీప్ రట్టి తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయంతో ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు