Share News

పత్తి ధర పైపైకి..కేసముద్రంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.9,111

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:38 PM

పత్తి సీజన్‌ ఆరంభంలోనే ధరలు ఎగబాకుతున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి గరిష్ఠంగా క్వింటాకు రూ.9111 ధర నమోదు కావ డం విశేషం.

పత్తి ధర పైపైకి..కేసముద్రంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.9,111
Cotton Prices

  • రూ.9వేలు దాటిన సగటు ధర

  • ఎల్‌నినో ప్రభావంతో సప్లై కొరత

కేసముద్రం(మహబుబాబాద్): పత్తి సీజన్‌ ఆరంభంలోనే ధరలు ఎగబాకుతున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి గరిష్ఠంగా క్వింటాకు రూ.9111 ధర నమోదు కావ డం విశేషం. ఈ మార్కెట్‌కు 30 మంది రైతులు 75 బస్తాల్లో పత్తి తీసుకురాగా ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌(ఈ-నామ్‌) విధానంలోని ‘ఈ-వేలం’లో పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.9111, కనిష్ఠంగా రూ.5611, సగటున రూ.9011 ధరల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌కు గత వారం రోజులుగా పత్తి రాబడు లు స్వల్పంగా పెరుగుతున్నాయి.


ఈనెల ఆరంభం నుంచి నిన్నటి వరకు పత్తి సగటు ధర రూ.8200 నుంచి రూ.8700 మధ్యనే ఉండ గా.. తాజాగా రూ.9011 నమోదు కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో పత్తి రూ.7400 నుంచి రూ.7600 మధ్యనే ఉండగా ఆ సమయంలో భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ.8110తో రైతుల పత్తిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది పత్తికి కేంద్రం కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.8667 పెంచింది. అయినప్పటికీ పత్తి ధర బయటి మార్కెట్లోనే అంతకు మించి ఉండడంతో సీసీఐ కొనుగోళ్లు ఈసారి ఉండే అవకాశం కనిపించడంలేదు.


hnk2.2.jpgఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడులపై విపరీతమైన ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే పత్తి సప్లై ఉండబోదనే అంచనాలతో మార్కెట్లో పత్తి ధర గత వా రం రోజులుగా నిత్యం పెరుగుతూ పోతున్నట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. దీంతోపాటే ముడి పత్తి ఉత్పత్తులైన గింజలు, బేళ్ల ధరలు పెరుగుతుండడంతో మార్కెట్లో పత్తి ధరలు ప్రభావితం అవుతున్నాయి.


క్వింటా పత్తికి 65 కిలోల గింజలు ఉత్పత్తి అవుతాయి. ఈ పత్తి గింజల ధరలు గతేడాది ఇదే సమయానికి క్వింటాకు రూ.3300 నుంచి రూ.3400 ఉండగా ప్రస్తుతం రూ.4500లకు పెరిగింది. బేళ్ల ధర రూ.57వేల నుంచి రూ.66వేలకు పెరిగింది. వీటి ధరలతోపాటు మరింత పెరుగుతుందనే అంచనా వ్యాపారం కారణంగా మార్కెట్లో పత్తి ధర పెరుగుతోంది. ఏదేమైనా ఎల్‌నినో ప్రభావంతో పత్తి దిగుబడి తక్కువగా వచ్చినప్పటికీ ధరలు అధికంగా ఉండడంతో రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

గ్రామాల్లో గంజాయి ఘాటు

కాచిగూడలో తప్పిన ప్రమాదం.. తండ్రి, కూతురిని కాపాడిన కానిస్టేబుల్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 12:38 PM