Share News

హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశాం.. సౌదీ దళాల ప్రకటన

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:38 AM

సౌదీ అరేబియాలోని ఖమీస్‌ ముషాయిత్‌‌పై హూతీలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను తాము ధ్వంసం చేశామని యెమెన్‌లోని సౌదీ సంకీర్ణ దళాలు ఈరోజు (మంగళవారం) ప్రకటించాయి.

హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశాం.. సౌదీ దళాల ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలోని ఖమీస్‌ ముషాయిత్‌‌పై హూతీలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను తాము ధ్వంసం చేశామని యెమెన్‌లోని సౌదీ సంకీర్ణ దళాలు ఈరోజు (మంగళవారం) ప్రకటించాయి. అలాగే సోమవారం రాత్రి రియాద్‌పై ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న విషయాన్ని కూడా ఆ దళాలు వెల్లడించాయి. కాగా గత కొన్ని రోజులుగా సౌదీ అరేబియా విమానాశ్రయాలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కనీసం 13 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు.


సౌదీ విమానాశ్రయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలోని ఎయిర్‌పోర్ట్‌లకు పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేస్తున్నాయి. తాజాగా యూఏఈకి చెందిన ఓ విమానయాన సంస్థ నవంబర్ 29 వరకు రియాద్‌కు విమాన సర్వీసులను రద్దు చేశామని తెలిపింది.


ఈ వార్తలూ చదవండి

రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. షాకింగ్ సీన్స్

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి!

Updated Date - Oct 13 , 2026 | 12:25 PM