Share News

సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కును వినియోగంలోకి తేవాలి: కవిత

ABN , Publish Date - Jul 09 , 2026 | 08:14 PM

బయ్యారం ఉక్కు తెలంగాణ, ఆదివాసీల హక్కుగా నినదిస్తూ వచ్చామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కును వినియోగంలోకి తేవాలి: కవిత
Kalvakuntla Kavitha

మహబూబాబాద్, జులై 9 (ఆంధ్రజ్యోతి): బయ్యారం ఉక్కు తెలంగాణ, ఆదివాసీల హక్కుగా నినదిస్తూ వచ్చామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు. కానీ రకరకాల కారణాలతో ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాంత వాసుల కల నెరవేర్చలేదని తెలిపారు. ఈరోజు (గురువారం) మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఇనుపరాతి గుట్టలను కవిత పరిశీలించి, మాట్లాడారు.


ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలన్న, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్న బయ్యారం ఉక్కును వినియోగంలోకి తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. అవసరమైతే ఛత్తీస్‌గఢ్‌లోని ఐరన్ ఫ్యాక్టరీలతో మనం అనుసంధానం చేయాలని సూచించారు. తెలంగాణ రక్షణ సేనగా తాము మాత్రం సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కును వినియోగంలోకి తీసుకువస్తే బాగుంటుందని భావిస్తున్నామని అన్నారు. అప్పుడే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలతో పాటు సింగరేణి కూడా బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 08:24 PM