Share News

ఆశలన్నీ ఆవిరై.. పొలంలో బైక్‌ రైడ్‌ చేస్తూ వినూత్న నిరసన

ABN , Publish Date - Oct 24 , 2026 | 01:03 PM

పంటకు నీరు అందక యువ రైతు మనస్తాపం చెందాడు. పొలంలో బైక్‌పై తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపాడు.

ఆశలన్నీ ఆవిరై.. పొలంలో బైక్‌ రైడ్‌ చేస్తూ వినూత్న నిరసన
TG News, Warangal

  • పంటకు నీరు అందక యువ రైతు మనోవేదన

గణపురం(జయశంకర్ భూపాలపల్లి): పంటకు నీరు అందక యువ రైతు మనస్తాపం చెందాడు. పొలంలో బైక్‌పై తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌ తనకున్న మూడెకరాల్లో వరి పంట వేశాడు. పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందకపోవడంతో వరి ఎండిపోతుందని, మరోవైపు విద్యుత్‌ సరఫరాలో సమస్యల కారణంగా పంటకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొందని మనస్తాపం చెందాడు. పంట కోసం తెచ్చిన పెట్టుబడులు వృథా అవుతోందని ఆందోళనక గురయ్యాడు. ఈ నేపథ్యంలో పొలంలో బైక్‌ను తిప్పుతూ వినూత్న తరహాలో నిరసన తెలిపాడు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.


hnk1.jpgఈ వార్తలు కూడా చదవండి:

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో జర జాగ్రత్త!

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 01:03 PM