Share News

ఇసుకనే బ్లాక్‌బోర్డ్‌గా మార్చి పాఠాలు చెబుతున్న కేరళ బామ్మ!

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:45 AM

కేరళకు చెందిన 'ఆశాట్టి అమ్ముమ్మ'గా పిలువబడే ఓ వృద్ధురాలు వినూత్న రీతిలో పిల్లలకు చదువు చెబుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. కేవలం ఇసుక, పుల్ల సాయంతో అక్షరాలు దిద్దిస్తూ అరుదైన రీతిలో విద్యాదానం చేస్తోంది.

ఇసుకనే బ్లాక్‌బోర్డ్‌గా మార్చి పాఠాలు చెబుతున్న కేరళ బామ్మ!
Kerala Grandmother Teaching

ఇంటర్నెట్ డెస్క్: విద్యా బోధన అనేది ఓ కళ. ఎలా పడితే అలా బోధిస్తే విద్యార్థులు సరిగ్గా అర్థం చేసుకోలేరు. వారి కోసం కొన్ని ప్రత్యేక బోధన పద్ధతులు పాటించాలి. అయితే కొంత మంది ఉపాధ్యాయులు, వ్యక్తులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు. టీచింగ్‌లో విద్యార్థులకు అటెన్షన్ కలిగించడం వల్ల వారు నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. దేశంలో విద్యా విధానంలో బోధన, నేర్చుకునే విధానంపై రోజురోజుకూ కొత్త చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన ఓ బామ్మ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.


కేరళకు చెందిన 'ఆశాట్టి అమ్ముమ్మ'గా పిలువబడే ఓ వృద్ధురాలు వినూత్న రీతిలో పిల్లలకు చదువు చెబుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. డిజిటల్ యుగంలోనూ ఎటువంటి ఆధునిక వసతులు లేకుండా, కేవలం ఇసుక, పుల్ల సాయంతో అక్షరాలు దిద్దిస్తూ అరుదైన రీతిలో విద్యాదానం చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ 'మోమ్ ఆఫ్ సఫాచీ' షేర్ చేసిన ఈ వీడియో ప్రకారం.. ఆశాట్టి అమ్ముమ్మ కొందరు చిన్నారుల కోసం పాఠశాలలో ఈ ప్రత్యేక పాఠాలు నిర్వహించారు. ఒక బకెట్ నిండ ఇసుకు తీసుకువచ్చి.. విద్యార్థుల ముందు చల్లారు. పుల్ల సాయంతో ఆ ఇసుకుని చదునుగా చేశారు ఆ బామ్మ.


అనంతరం ఆ ఇసుకపై పుల్లతో ఇంగ్లీష్ అక్షరాలను రాస్తూ.. వాటి కర్సివ్ రూపాలను కూడా ఎంతో ఓపికగా నేర్పించారు. ఈ బామ్మ రాస్తుంటే, చిన్నారులు సైతం తమ వేళ్లతో ఇసుకపై అక్షరాలను దిద్దుతూ ఉత్సాహంగా పాఠాలు నేర్చుకున్నారు. డబ్బును ఆశించకుండా, విద్య పట్ల ఉన్న మక్కువతో చిన్నారులకు పాఠాలు నేర్పుతున్న ఈ బామ్మ నిబద్ధతకు నెటిజన్లను ఫిదా అవుతున్నారు. ఈ సరికొత్త బోధనా శైలి చూసిన ప్రతి ఒక్కరూ వృద్ధురాలి సేవలను కొనియాడుతున్నారు. డిజిటల్, ఇంటర్నెట్ అవసరం లేదని ఈ కొత్త విద్యా విధానం సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు..

చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక శివానందన్!

బాలీవుడ్ హీరోయిన్‌ కరిష్మాతో రోహిత్ డ్యాన్స్.. వీడియో వైరల్

Updated Date - Oct 24 , 2026 | 12:26 PM