Share News

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 24 , 2026 | 08:44 AM

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. అతడి రీఎంట్రీపై స్పందించిన మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. ఒక్క మ్యాచ్‌తో అతడి అంచనా వేయొద్దని, మరికొంత సమయం ఇవ్వాలని సూచించాడు.

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు..
Bhuvneshwar Kumar Comeback

స్పోర్ట్స్ డెస్క్: దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా భువీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో, 2022 తర్వాత మళ్లీ భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే, అతని రీఎంట్రీ మ్యాచ్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు.


ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 49 పరుగులు సమర్పించుకుని వికెట్లేమీ పడగొట్టలేదు. ముఖ్యంగా అతను రెండు నో-బాల్స్ వేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో భువీ రీఎంట్రీపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా భువీ నో-బాల్స్ వేసే బౌలర్ కాదని, మ్యాచ్‌లో ఒత్తిడి లేదా శారీరకంగా తాను పూర్తిగా సిద్ధంగా లేకపోవడం వల్లే ఇది జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. తొలి, ఆఖరి ఓవర్లు బాగానే వేసినప్పటికీ, మధ్యలో వేసిన ఓవర్లలో నో-బాల్స్ రావడం వల్ల భారీగా పరుగులు వచ్చాయని కార్తీక్ తెలిపాడు. న్యూజిలాండ్ మ్యాచ్‌లో భువీ తన స్థాయి ఆట ఆడలేదని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.


అయితే ఒకవైపు భువీని విమర్శిస్తూ, మరోవైపు అతడికి మద్దతుగా నిలిచాడు. ఒకే మ్యాచ్‌తో సీనియర్ ఆటగాడిని అంచనా వేయవద్దని, అభిమానులు భువీకి కాస్త మద్దతుగా నిలవాలని కార్తీక్ కోరాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నందున అతనికి కొంత సమయం ఇవ్వాలని సూచించాడు. భువనేశ్వర్ తన తప్పులను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తాడని క్రీడా విశ్లేషకులు కూడా భావిస్తున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి

మోజ్తాబా ఖమేనీ బహిరంగంగా ఎందుకు కనిపించడం లేదు.. ఇరాన్ దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు..

అకస్మాత్తుగా ప్యాసింజర్లకు వాంతులు.. విమానంలో కలకలం

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..

Updated Date - Oct 24 , 2026 | 08:47 AM