Share News

మోజ్తాబా ఖమేనీ బహిరంగంగా ఎందుకు కనిపించడం లేదు.. ఇరాన్ దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 24 , 2026 | 08:30 AM

ఇరాన్ సుప్రీం నేత మోజ్తాబా ఖమేనీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఆ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీమ్ తెలిపారు. ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న అనుమానాలకు ఆయన సమాధానం ఇచ్చారు.

మోజ్తాబా ఖమేనీ బహిరంగంగా ఎందుకు కనిపించడం లేదు.. ఇరాన్ దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు..
Mojtaba Khamenei

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం నేత మోజ్తాబా ఖమేనీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఆ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీమ్ తెలిపారు. ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న అనుమానాలకు ఆయన సమాధానం ఇచ్చారు. భద్రతా కారణాల వల్లే ఆయన బహిరంగంగా కనిపించడం లేదని వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2026లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు (Mojtaba Khamenei).


ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ఖమేనీతో సుమారు ఏడు గంటలపాటు సమావేశమయ్యారని ఇలాహీ తెలిపారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా మోజ్తాబాతో సమావేశమైనట్లు పేర్కొన్నారు. తనకు తెలిసిన కొందరు వ్యక్తులు మోజ్తాబా ఖమేనీని నేరుగా కలిశారని, వారంతా ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారని దౌత్యవేత్త వివరించారు. భద్రతా పరిస్థితుల కారణంగానే మోజ్తాబా మీడియా ముందుకు రావడం లేదని చెప్పారు. ఆయన తన బాధ్యతలను నిర్వహిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో రాత్రివేళ బయటకు కూడా వస్తున్నారని పేర్కొన్నారు (Mojtaba Khamenei Health).


మోజ్తాబా ఖమేనీ గత కొన్ని నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది (Iran US War). అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన చనిపోయారని, లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని కథనాలు వచ్చాయి. ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు కనిపించకపోవడం ఈ చర్చలకు మరింత కారణమైంది. అయితే తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియలకు మోజ్తాబా హాజరయ్యారని ఇలాహీ తాజాగా తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..


మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 24 , 2026 | 08:38 AM