వాటర్‌బోర్డులో పొదుపు మంత్రం
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:24 AM
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి, విద్యుత్ వనరుల సంరక్షణకు వాటర్‌బోర్డు నడుం బిగించింది. వాటర్‌బోర్డు పరిధిలోని అన్ని కార్యాలయాల్లో నీరు, విద్యుత్ వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించేలా చర్యలు చేపట్టాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కార్యాలయాల్లో 20శాతం నీరు, విద్యుత్ పొదుపు తప్పనిసరి
ఏసీల ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ వద్దే ఉంచాలి
సాయంత్రం 5 దాటితే బంద్
హైదరాబాద్ సిటీ: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి, విద్యుత్ వనరుల సంరక్షణకు వాటర్‌బోర్డు నడుం బిగించింది. వాటర్‌బోర్డు పరిధిలోని అన్ని కార్యాలయాల్లో నీరు, విద్యుత్ వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించేలా చర్యలు చేపట్టాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ కండిషనర్ల ఉష్ణోగ్రతను తప్పనిసరిగా 25డిగ్రీల సెల్సియస్ వద్దే ఉంచాలన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఏసీల వినియోగాన్ని నిలిపివేయాలని, అత్యవసర నిర్వహణ అవసరాల కోసం ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతి ఉన్న సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఏసీల నుంచి వెలువడే నీటిని వృథాగా పోనివ్వకుండా సేకరించి, మొక్కల పెంపకం, శుభ్రత, ఇతర తాగునీరు అవసరం లేని పనులకు పునర్వినియోగించాలి. లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి.
పొదుపు చేస్తే ప్రశంసాపత్రం
కార్యాలయాల్లో అవసరం లేని సమయాల్లో లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్ పరికరాలను తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. ప్రతీ ఉద్యోగి విద్యుత్ పొదుపును వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. ప్రతీ కార్యాలయంలో నీరు, విద్యుత్ వినియోగ వివరాలను క్రమం తప్పకుండా అధికారులు పరిశీలించాలి. గత వినియోగంతో పోల్చి కనీసం 20 శాతం పొదుపు సాధించేలా చర్యలు చేపట్టాలి. ఈ నిబంధనల అమలుకు సంబంధిత కార్యాలయ అధికారులే బాధ్యత వహించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. నీరు, విద్యుత్ సంరక్షణలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News