ఆసిఫాబాద్‌లో అరుదైన ‘టస్సార్ సిల్క్ మాత్’
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:21 AM
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ అటవీ ప్రాంతంలో అరుదైన టస్సార్ సిల్క్ మాత్ కీటకం కనిపించింది.
పెంచికల్‌పేట్ అటవీ ప్రాంతంలో ప్రత్యక్షం!
పెంచికల్‌పేట్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ అటవీ ప్రాంతంలో అరుదైన టస్సార్ సిల్క్ మాత్ కీటకం కనిపించింది. మండలంలోని అగర్‌గూడ గ్రామంలోని ఓ ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు సంచరిస్తూ ఉంది. చూడడానికి సీతాకోక చిలుకను పోలిన ఈ జీవి పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలకమైనదని అటవీ అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ వస్త్ర విపణిలో విశేషమైన ప్రాముఖ్యం ఉన్న సహజసిద్ధ వన్య పట్టు (టస్సార్ సిల్క్) ఉత్పత్తికి ఈ కీటకమే మూలాధారం. లేత గులాబీ, బంగారు గోధుమ వర్ణాల మేళవింపుతో సుమారు 15 సెంటిమీటర్ల వెడల్పు ఉన్న ఈ జీవి రూపం స్థానికులను, పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంది. ఈ ప్రాణికి ప్రకృతి సిద్ధంగానే అద్భుతమైన ఆత్మరక్షణ వ్యవస్థ ఉంది. కాలుష్యం లేని జీవవైవిధ్యం సమృద్ధిగా ఉండే దట్టమైన అడవుల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News