Share News

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి!

ABN , Publish Date - Oct 24 , 2026 | 08:02 AM

బిహార్‌లోని సీవాన్ జిల్లాలో అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, శిథిలాల కింద మరొకరు ఉండవచ్చని రెస్క్యూ బృందం అనుమానిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి!
Bihar Firecracker Factory Blast

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని సీవాన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్లాంపూర్ గ్రామంలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని సీవాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) భరత్ సోనీ మీడియాకు వెల్లడించారు. వైద్య బృందం అంచనా మేరకు ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు సివిల్ సర్జన్ ధృవీకరించారని ఎస్పీ తెలిపారు.


ప్రమాదం జరిగిన సమయంలో బాణాసంచా తయారీ ప్రాంతంలో దాదాపు 7 నుంచి 8 మంది సభ్యులు ఉండగా, వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన సమయంలో మరో ముగ్గురు ఆ ఇంటి బయట ఉన్నారని సమాచారం. వారి ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరో మృతదేహం ఉండే అవకాశం ఉందని రెస్క్యూ టీమ్ టీమ్ అనుమానిస్తోంది.


సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) బృందంతో పాటు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) రంగంలోకి దిగాయి. అలాగే ప్రాంతాన్ని పరిశీలించేందుకు డ్రోన్లను కూడా వినియోగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. జనవాస ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అకస్మాత్తుగా ప్యాసింజర్లకు వాంతులు.. విమానంలో కలకలం

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..

Updated Date - Oct 24 , 2026 | 08:37 AM