Share News

పెన్షన్‌ పేరుతో సైబర్‌ మోసాలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 07:52 AM

వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచే పెన్షన్‌ సొమ్ముపై సైబర్‌ నేరగాళ్లు కన్నేస్తున్నారు. పెన్షన్‌ మంజూరు, పెన్షన్‌ పెంపు, బకాయిల విడుదల, లబ్ధిదారుల వివరాల నవీకరణ పేరుతో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు.

పెన్షన్‌ పేరుతో సైబర్‌ మోసాలు
cyber crime

  • వృద్ధులు జాగ్రత్త

  • సైబర్‌ క్రైం డీసీపీ పుష్ప హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ: వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచే పెన్షన్‌ సొమ్ముపై సైబర్‌ నేరగాళ్లు కన్నేస్తున్నారు. పెన్షన్‌ మంజూరు, పెన్షన్‌ పెంపు, బకాయిల విడుదల, లబ్ధిదారుల వివరాల నవీకరణ పేరుతో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్‌ చేసి, వాట్సాప్‌ సందేశాలు పంపి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారం సేకరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం డీసీపీ కె.పుష్ప సూచించారు. ప్రభుత్వ శాఖల పేరుతో నకిలీ లింకులు పంపించి వాటిపై క్లిక్‌ చేయాలని ఒత్తిడి తీసుకొస్తారని, దీనిపై వృద్ధులతో పాటు వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఏడాది చివరి నెలల్లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని డీసీపీ పుష్ప తెలిపారు.


మోసపోతే ఫిర్యాదు చేయండి..

పెన్షన్‌ విషయంలో సందేహాలు ఉంటే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 జాతీయ సైబర్‌ కైరమ్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలి. అదేవిధంగా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. బ్యాంకుకు సమాచారం అందించి ఖాతా, డిజిటల్‌ చెల్లింపుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్‌ మోసాల నుంచి రక్షణ ఉంటుందని సైబర్‌ క్రైం డీసీపీ పుష్ప పేర్కొన్నారు.


city2.2.jpgఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • బ్యాంకు లేదా పెన్షన్‌ వివరాల పేరుతో ఫోన్‌ చేస్తే ఓటీపీ, ఏటీఎం పిన్‌, యూపీఐ పిన్‌ వెల్లడించవద్దు.

  • అనుమానాస్పద లింకులు తెరవొద్దు. పెన్షన్‌ పత్రాల నవీకరణ పేరుతో వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్ లలో వచ్చే లింకులను పరిశీలించకుండా క్లిక్‌ చేయవద్దు.

  • యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయొద్దు. సమస్య పరిష్కరిస్తామంటూ తెలియని యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయమని చెప్పినా, స్ర్కీన్‌ షేరింగ్‌ చేయమన్నా అంగీకరించవద్దు.

  • ఆధార్‌, బ్యాంకు పాస్‌బుక్‌, ఏటీఎం కార్డు వివరాలు, ఇతర గుర్తింపు పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులకు పంపవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 07:52 AM