జీడీ నాయుడి జీవితం యువతకు స్ఫూర్తి
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:17 AM
దేశంలో తొలి పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి సాంకేతిక విద్యకు పునాది వేసిన తెలుగు వ్యక్తి గోపాలస్వామి దొరైస్వామి (జీడీ) నాయుడు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
ఆయన సేవలను సీవీ రామన్ సైతం కొనియాడారు
‘అప్పా-మా నాన్న జీడీ నాయుడు’ పుస్తకావిష్కరణ
సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశంలో తొలి పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి సాంకేతిక విద్యకు పునాది వేసిన తెలుగు వ్యక్తి గోపాలస్వామి దొరైస్వామి (జీడీ) నాయుడు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తమిళనాడు పాఠశాలల్లో ఆయన జీవిత చర్రితను పాఠ్యాంశంగా బోధిస్తుండడం గర్వకారణమని చెప్పారు. భారత ఎడిసన్‌గా పేరు పొందిన జీడీ నాయుడి జీవితం ఆధారంగా మాధవన్ ప్రధాన పాత్రలో జీడీఎన్ సినిమా రావడం సంతోషకరమన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, వ్యవసాయ రంగాల్లో కోయంబత్తూరు కేంద్రంగా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేసిన జీడీ నాయుడి సేవలను సర్ సీవీ రామన్ సైతం కొనియాడారని గుర్తు చేశారు.
జీడీ నాయుడి జీవిత చరిత్రను ఆయన కుమారుడు గోపాల్ చెబుతున్న కథనంగా ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి రాయగా.. దాన్ని ఇసనాక మురళీధర్ ‘అప్పా- మా నాన్న జీడీ నాయుడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని శుక్రవారం మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో వెంకయ్య ఆవిష్కరించారు. తొలి ప్రతి ని నందమూరి రామకృష్ణకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీడీ నాయుడి జీవిత చరిత్రను హిందీలోకి అనువాదం చేయించడంతో పాటు ఆ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించే బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు
Read Latest Telangana News And Telugu News