Share News

బాలీవుడ్ హీరోయిన్‌ కరిష్మాతో రోహిత్ డ్యాన్స్.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:57 AM

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ షోలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ హీరోయిన్‌ కరిష్మాతో రోహిత్ డ్యాన్స్.. వీడియో వైరల్
Rohit Sharma Dance

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ప్రత్యర్థి బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడుతుంటాడు. అలాంటి హిట్‌మ్యాన్ మైదానం బయట డ్యాన్స్ చేస్తూ ప్రత్యేకంగా కనిపించాడు. బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్‌తో కలిసి చిందేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. కరిష్మాతో రోహిత్ డ్యాన్స్ చేయాల్సిన ప్రత్యేక సందర్భం ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...


సోనీ నెట్‌వర్క్ ఛానల్‌లో 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' అనే షోకు రోహిత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ నెట్ వర్క్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం సోనీ లివ్‌లో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీతో పాటు సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి.. తమ కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంటారు. అలానే తాజాగా ఈ షోకు కరిష్మా కపూర్ తన సోదరులు అదర్ జైన్, అర్మాన్ జైన్, వదిన అనిస్సా మల్హోత్రాతో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కరిష్మా కపూర్‌ ఐకానిక్ సాంగ్ 'లే గయి లే గయి'కి రోహిత్ డ్యాన్స్ చేశాడు. కరిష్మా కపూర్ డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె స్టెప్స్‌ను రోహిత్ అనుకరించే ప్రయత్నం చేశాడు. కరిష్మా కపూర్ మూవీస్ చూస్తూ పెరిగిన తనకు ఆమెతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని రోహిత్ అన్నాడు. హిట్ మ్యాన్ స్టెప్స్‌ను కరిష్మా ప్రత్యేకంగా అభినందించింది.


ఇవి కూడా చదవండి:

స్మిత్ క్యాచ్ వ్యవహారం.. భయంతోనే ముఖం తిప్పుకున్నా: బవుమా

ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Updated Date - Oct 24 , 2026 | 07:45 AM