Share News

కాజీపేట మీదుగా దసరా స్పెషల్‌ రైళ్లు

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:07 AM

దసరా పండుగను పురస్కరించుకుని కాజీపేట మీదుగా స్పెషల్‌ రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కాజీపేట మీదుగా దసరా స్పెషల్‌ రైళ్లు
Dasara Special Trains

కాజీపేట(వరంగల్): దసరా పండుగను పురస్కరించుకుని కాజీపేట మీదుగా స్పెషల్‌ రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 9 నుంచి 25 వరకు సికింద్రాబాద్‌ - సిర్పూర్‌కాగజ్‌ నగర్‌ - హైదరాబాద్‌ల మధ్య 34 రైళ్లను నడిపిం చనున్నట్లు తెలిపారు. (0711) సికింద్రాబాద్‌- సిర్పూర్‌కాగజ్‌ నగర్‌ మధ్య నడిచే ఈ రైలు సికింద్రాబాద్‌లో 12.10 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2.10 నిమిషాలకు కాజీపేటకు చేరుకుంటుంది.


ఈ రైలు సాయంత్రం 5.30ని, సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. తిరిగి సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో సాయంత్ర 6 గంటలకు బయలుదేరి కాజీపేటకు రాత్రి 8 గంటలకు చేరుకుని హైదరాబాద్‌కు రాత్రి 11.15కు చేరుకుంటుంది. ఈరైలుకు చర్లపల్లి, భువనగిరి, యాదాద్రి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, అసిఫాబాద్‌, స్టేషన్‌లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు.


kza2.2.jpgవన్‌వే ఫెస్టిఫల్‌ స్పెషల్‌ రైలు

హైదరాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దిన్‌, చర్లపల్లి- హజ్రత్‌నిజాముద్దిన్‌ మధ్య మరో వన్‌వే స్పెషల్‌ రైలు నడిపించనున్నారు. (07031) హైదరాబాద్‌ - హజ్రత్‌నిజాముద్దిన్‌ రైలు ఈ నెల 9న రాత్రి 11. 25 నిమిసాలకు హైదరాబాద్‌లో బయలుదేరి కాజీపేటకు తెల్లవారు జామున 1.30ని.కు చేరుకుంటుంది.


అక్టోబరు 11న (07035) చర్లపల్లి - హజ్రత్‌ నిజాముద్దిన్‌స్పెషల్‌ రైలు చర్లపల్లిలో రాత్రి 11.55ని, బయలుదేరి కాజీపేటకు తెల్లవారుజామున 2 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. ఈ రైళ్లకు కాజీపేట, బల్లార్షా, నాగపూర్‌, ఇటార్సి, జబల్‌పూర్‌, కఠ్నీ, సంత, చిత్రకుట్‌, ధామ్‌, కర్‌వి, బాందా, వీజీఎల్‌ ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా, రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 11:07 AM