Share News

పాలపిట్టను బంధించడం నేరం

ABN , Publish Date - Oct 10 , 2026 | 10:43 AM

దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను చూస్తే శుభ సూచకమనే సంప్రదాయంతో దానిని బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరమని అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

పాలపిట్టను బంధించడం నేరం
Telangana State Bird

  • అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రభాకర్‌

భూపాలపల్లి: దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను చూస్తే శుభ సూచకమనే సంప్రదాయంతో దానిని బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరమని అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రభాకర్‌ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పాలపిట్ట రక్షణ పోస్టర్‌ను గ్రీన్‌ వారియర్‌ జేవీఎస్‌ చంద్రశేఖర్‌కు అందించారు.


hnk1.2.jpgఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రజలు పొలాల గట్లపైకి అడవుల్లోకి వెళ్లి ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూసేవారన్నారు. అలాంటిది నేడు పాలపిట్ట ఎగిరిపోకుండా రెక్కలు కత్తిరించి కాళ్లకు దారాలతో కట్టివేయడం, రెక్కలకు జిగుర్లు పూయడం వంటి క్రూరమైన పనులు చేస్తున్నారన్నారు.


జనం గూమిగూడి ఉండే ప్రదేశాల్లో డబ్బుల కోసం పాలపిట్టను ప్రదర్శిస్తున్నారని, అలాంటివి ఏమైనా జిల్లాలో కానవస్తే వెంటనే 1800-425- 5364 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్ర పక్షి పాలపిట్ట ప్రాణాలు కాపాడేందుకు, తెలంగాణ గౌరవాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరూ దోహదపడాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 10:48 AM