Share News

గుప్పెడంత మనస్సుకు దిగులు

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:49 AM

మనస్సంతా తెలియని దిగులు. చెప్పలేని బాధ. ఎందుకీ జీవితం అనే నైరాశ్యం.. ఇలా డిప్రెషన్‌తో బాధ పడే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగిపోతోంది.

గుప్పెడంత మనస్సుకు దిగులు
World Mental Health Day

  • నేడు వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే

హైదరాబాద్‌ సిటీ: మనస్సంతా తెలియని దిగులు. చెప్పలేని బాధ. ఎందుకీ జీవితం అనే నైరాశ్యం.. ఇలా డిప్రెషన్‌తో బాధ పడే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగిపోతోంది. చాలా మంది తాము డిప్రెషన్‌లో ఉన్నమనే ధ్యాస కూడా ఉండదు. అది డిప్రెషన్‌ అని తెలుసుకునేలోపే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం వైద్యుల వద్దకు వచ్చే ప్రతి పది మందిలో నలుగురైదుగురు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక సమస్యలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది అక్టోబర్‌ 10న ‘వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌డే’ను నిర్వహిస్తున్నారు.


city3.jpgలక్షణాలు కనిపిస్తే వైద్యుల వద్దకు వెళ్లాలి..

గతంలో ఆనందాన్నిచ్చిన పనులు, హాబీలు, కార్యక్రమాలపై ఆసక్తి కోల్పోతారు. నిద్ర పట్టకపోవడం, అతిగా నిద్రపోవడం చేస్తా రు. నిరంతర భయం, అతిగా ఆలోచించడం, పానిక్‌ అటాక్స్‌ రావడం లేదా వాటి భయంతో కొన్ని పనులకు దూరంగా ఉంటారు. తాను ఇతరులకు భారమని భావించడం, స్వీయహాని గురించి మాట్లాడటం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మానసిక వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.

  • డాక్టర్‌ హసంతి తుమ్మూరోతు, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్టు, మెడికవర్‌ హాస్పిటల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌


మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఇంట్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ముఖ్యంగా ఆస్పత్రుల్లో మానసిక సమస్యలతో బాధపడేవారి మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారి అనుభవాలను గౌరవిస్తూ, తీర్పులు ఇవ్వకుండా వినడం ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి.

  • డాక్టర్‌ చరణ్‌ తేజ కొగంటి, సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరో సైకియాట్రిస్టు, కిమ్స్‌ హాస్పిటల్స్‌, కొండాపూర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 09:54 AM