Share News

రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారిపై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:51 AM

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణకుమారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారిపై సస్పెన్షన్ వేటు
RR Dist DMHO Swarna Kumari

హైదరాబాద్, అక్టోబర్ 10: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణకుమారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీజ్ చేసిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని తిరిగి తెరిచేందుకు తన కారు డ్రైవర్ ద్వారా నగదు డిమాండ్ చేసిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆమెను వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమెతోపాటు మరో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


దీంతో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారిపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న స్వర్ణకుమారి గతంలో ఇదే జైలులో వైద్యురాలిగా విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2013 వరకు జైళ్ల శాఖ శిక్షణ సంస్థలో ఆమె వైద్యురాలిగా పని చేశారు. ఈ సమయంలో కొన్ని రోజులపాటు డిప్యూటేషన్‌పై చంచల్‌గూడ జైలులో వైద్యురాలిగా పని చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రీల్స్ చూసి ఫొటోల కోసం వెళ్లి.. క్వారీలో మునిగి విద్యార్థి మృతి

కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా

Updated Date - Oct 10 , 2026 | 09:52 AM