Share News

రీల్స్ చూసి ఫొటోల కోసం వెళ్లి.. క్వారీలో మునిగి విద్యార్థి మృతి

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:52 AM

ఇన్‌స్టాగ్రామ్‌‌లో రీల్స్ చూసి ఫొటోలు దిగేందుకు వెళ్లి ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని మల్కారం క్వారీలో చోటు చేసుకుంది.

రీల్స్ చూసి ఫొటోల కోసం వెళ్లి.. క్వారీలో మునిగి విద్యార్థి మృతి

హైదరాబాద్, అక్టోబర్10: ఇన్‌స్టాగ్రామ్‌‌లో రీల్స్ చూసి ఫొటోలు దిగేందుకు వెళ్లి ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని మల్కారం క్వారీలో చోటు చేసుకుంది. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి పవన్ సాయి.. తన స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి ఫొటోలు దిగేందుకు మల్కారం క్వారీకి వెళ్లారు. ఆ క్వారీలో ఈతకు దిగిన పవన్ సాయి.. నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని స్నేహితులు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)కు సమాచారం అందించారు. డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. గాలింపు చర్యలు చేపట్టాయి.


పవన్ సాయి మృతదేహాన్ని వెలికి తీశాయి. అతడి మృతదేహాన్ని జవహర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్ సాయికి ఈత రాకపోవడం వల్లే మరణించాడని అతడి స్నేహితులు తెలిపారు. క్వారీ చాలా లోతుగా ఉందని.. అందువల్లే అతడు చనిపోయాడని చెప్పారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పవన్ సాయి మృతితో అతడి కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు..

చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

Updated Date - Oct 10 , 2026 | 08:03 AM