తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:14 AM
ఎల్‌నినో ప్రభావంతో జోగులాంబ-గద్వాల జిల్లా అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నీటి ఎద్దడిని అధిగమించడానికి 2.981 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శికి రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ రమేశ్‌బాబు లేఖ రాశారు.
తుంగభద్ర బోర్డు కార్యదర్శికి ఈఎన్‌సీ లేఖ
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జోగులాంబ-గద్వాల జిల్లా అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నీటి ఎద్దడిని అధిగమించడానికి 2.981 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శికి రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ రమేశ్‌బాబు లేఖ రాశారు. ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు 15 రోజులు నీటిని విడుదల చేయాలని శుక్రవారం రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. తొలి 5 రోజులకు రోజుకు 2500 క్యూసెక్కుల చొప్పున, తరువాత ఐదు రోజులు 2300 క్యూసెక్కులు, చివరి ఐదు రోజులు 2100 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలన్నారు. పంటలు సాగు చేసుకున్న రైతులు సాగునీటి కోసం వేచి చూస్తున్నారన్న రమేశ్ బాబు.. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ నీరు ఉపయోగపడుతుందన్నారు.
టీజీ జెన్కోకు రాష్ట్ర స్థాయి అవార్డు
సమాచార హక్కు చట్టం-2005 అమలులో ప్రతిభ చూపినందుకు తెలంగాణ విద్యుత్తు ఉత్పాదక సంస్థ (టీజీ జెన్కో)కు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఆర్టీఐ కింద స్వచ్ఛందంగా సమాచార వెల్లడిలో ప్రతిభ చూపినందుకు ఈ అవార్డు దక్కిందని సంస్థ సీఎండీ ఎస్.హరీశ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నట్లు చెప్పారు. జెన్కో సేవలను సమాచార కమిషన్ ప్రశంసించిందన్నారు.
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్‌పీడీసీఎల్) పరిధిలో కరీంనగర్ సర్కిల్ వందశాతం రియల్‌టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ (ఆర్‌టీఎఫ్ఎంఎస్)తో అనుసంధానమైంది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం తగ్గించడం, సమస్యలను వేగంగా గుర్తించి సమర్థవంతంగా ఫీడర్ల పనితీరు పర్యవేక్షణ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యమని సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ సర్కిల్ పరిధిలోని 82 సబ్ స్టేషన్లన్నీ సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) పరిధిలోకి వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 1005 సబ్ స్టేషన్లను స్కాడా పరిధిలోకి తెచ్చామని, త్వరలోనే హన్మకొండ, కుమరంభీం- ఆసిఫాబాద్ జిల్లాలనూ స్కాడాతో అనుసంధానిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాత్రి వేళల్లో రోడ్లపై బర్త్ డే పార్టీలొద్దు!
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!
నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News