మహాలయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 10:29 AM
మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మా దుర్గా దేవి ఆశీస్సులతో సమాజంలో ఆనందం, కరుణ, ఆశలు నిండాలని, దేశంలో శాంతిసమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
PM Modi Mahalaya Wishes: దేవీ శరన్నవరాత్రుల ఆగమనాన్ని చాటే పవిత్ర పండుగ 'మహాలయ' (Mahalaya) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మా దుర్గా దేవి ఆశీస్సులు సమాజంలో సుఖసంతోషాలు, కరుణతో నింపాలని, నలుదిశలా శాంతిసమృద్ధి వెల్లివిరియాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (X) వేదికగా తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'మా దుర్గా ఆశీస్సులు మన సమాజాన్ని ఆనందం, దయ, సహనంతో నింపుగాక' అని పేర్కొన్నారు.

పితృ పక్షానికి ముగింపు - దుర్గా పూజకు స్వాగతం
మహాలయతో పితృ పక్షం (పూర్వీకులకు శ్రాద్ధకర్మలు నిర్వహించే కాలం) ముగిసి, దుర్గా దేవి భూలోకానికి ఆగమనం చెందే దేవీ నవరాత్రుల సంబరాలు ప్రారంభమవుతాయి.
అస్సాంలో వేడుకలు
అస్సాంలోని జోర్హాట్ సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునే పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి భజనలు, ప్రత్యేక పూజలతో దుర్గా మాతను ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు