Share News

వికారాబాద్‌లో దారుణం.. చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌..

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:02 PM

వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో ఓ బాలిక ఈ విషయాన్ని తన పేరెంట్స్‌కి చెప్పినట్లు సమాచారం.

వికారాబాద్‌లో దారుణం.. చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌..
Vikarabad Teacher News

వికారాబాద్, సెప్టెంబర్ 23: పరిగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో చదువుతున్న ఓ బాలికతో టీచర్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టీచర్‌ ప్రవర్తనతో ఇబ్బందికి గురైన బాలిక ఈ విషయాన్ని సంరక్షుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో వారు పరిగి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక నుంచి.. ఆమె సంరక్షుల నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఇదిలా ఉండగా.. సదరు ఉపాధ్యాయుడు గతంలోనూ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయని సంరక్షులు చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిగి సర్కిల్‌ పరిధిలో వరుసగా విద్యార్థినులకు సంబంధించిన ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న దోమ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఘటన వెలుగులోకి రాగా.. తాజాగా పరిగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో ఘటన బయటపడింది. పాఠశాలల్లో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు, సంరక్షుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్

సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 04:21 PM