సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:33 PM
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీం ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సుప్రీం ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. సాయికృష్ణ కేసులో ఏపీ డీజీపీ, విజయవాడ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు(బుధవారం) జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారించింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ హైకోర్టులో విచారణపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేంతవరకూ హైకోర్టులో విచారణను నిలిపివేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
పోలీసు కస్టడీలో సాయికృష్ణ అదృశ్యమవడం చట్ట వ్యతిరేకమే అని జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం పేర్కొంది. సీల్డ్ కవర్‌లో కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ సెప్టెంబర్ 30వ తేదీలోగా సుప్రీంకోర్టుకు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రతివాదులందరకీ నోటీసులను జారీచేసిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
భారీ వర్షాలు.. ఆర్టీసీ అధికారులకు మంత్రి మండిపల్లి ఆదేశాలివే
అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News