‘ది ప్యారడైజ్’ కోసం నాని ప్రత్యేక విజ్ఞప్తి.. సీఎం రేవంత్ స్పందన ఇదే
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:03 AM
ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించి నేచరల్ స్టార్ నాని చేసిన ప్రత్యేక విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవించినందుకు నానికి అభినందనలు తెలియజేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించి నేచరల్ స్టార్ నాని చేసిన ప్రత్యేక విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవించినందుకు నానికి అభినందనలు తెలియజేశారు. యువ తెలంగాణ దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌కు ప్రశంసలు కురిపించారు. ప్రజా భద్రత, జనసమూహ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం పోలీసులు నిర్ణయం తీసుకుంటారని ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
కాగా.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైస్’ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని నాని కోరారు. అమల్లో ఉన్న అన్ని అవసరమైన ప్రోటోకాల్స్, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని, తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని నాని కోరారు.
ఇవి కూడా చదవండి...
ఎల్‌నినోపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
తెనాలి రైల్వేస్టేషన్ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం
Read Latest Telangana News And Telugu News