Share News

తెనాలి రైల్వేస్టేషన్‌ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:41 AM

గుంటూరు జిల్లాలోని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గుంటూరు మార్గం నార్త్ సైడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తెనాలి రైల్వేస్టేషన్‌ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం
Tenali Railway Station

గుంటూరు, సెప్టెంబర్ 23: జిల్లాలోని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గుంటూరు మార్గం నార్త్ సైడ్‌లో మెయిన్ విద్యుత్ వైర్ తెగింది. దీంతో తెనాలి రైల్వే స్టేషన్‌కు ఔటర్‌లో గుంటూరు- రేపల్లె రైలును అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. తెగిన వైర్లను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీలైనంత త్వరగా విద్యుత్ వైర్లను సరిచేసి రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అయితే విద్యుత్ వైర్లు తెగిపోయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి...

నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు

ఎల్‌నినోపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 09:43 AM