పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా అమరేంద్రకుమార్
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:26 AM
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.అమరేంద్రకుమార్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.అమరేంద్రకుమార్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల పాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటూ ఈ నెల 19న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించి, ఈ చర్య తీసుకుంది.