డిపాజిటర్ల పరిరక్షణకు బెజవాడలో ప్రత్యేక కోర్టు
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:23 AM
రాష్ట్రంలోని డిపాజిటర్ల పరిరక్షణ కేసుల విచారణకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ మంగళవారం రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిపాజిటర్ల పరిరక్షణ కేసుల విచారణకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ మంగళవారం రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక సంస్థల డిపాజిటర్ల రక్షణ చట్టం 1999 కింద వచ్చే కేసులను ప్రత్యేకంగా విచారించేందుకు ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం ఈ కోర్టు పరిధిలోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదంతో జిల్లా జడ్జి కేడర్‌లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులతోపాటు ఏపీ పీడీఎఫ్‌ఈ చట్టం కిందకు వచ్చే కేసులను ఈ కోర్టు విచారిస్తుంది.