Share News

ఎల్‌నినోపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , Publish Date - Sep 23 , 2026 | 08:29 AM

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఉపశమన చర్యలు అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఆవరణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఎల్‌నినోపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఉపశమన చర్యలు అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఆవరణలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ మంగళవారం కేంద్రాన్ని పరిశీలించారు. కాల్‌సెంటర్‌ టోల్‌ఫ్రీ నంబరు 155251కు రైతుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు సమాధానం ఇవ్వడంతోపాటు శాటిలైట్‌ ఆధారిత హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సీసీసీ సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు.

Updated Date - Sep 23 , 2026 | 08:29 AM