మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలు.. జూరాల నుంచి నీరు విడుదల
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:06 AM
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో జూరాల నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే జూరాల నుంచి నీటిని విడుదల చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి (Telangana Minister Vakiti Srihari) ఆదేశాలతో జూరాల నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. కుడి కాల్వ నుంచి 350 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రైతుల సాగునీటి అవసరాల మేరకు మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు (బుధవారం) సమావేశం కానున్నారు. జూరాలకు నీటి విడుదల, పలు అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి కృష్ణా నీటిని విడుదల చేయాలని సీఎం డీకే శివకుమార్‌కు నిన్న రాత్రి మంత్రులు వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను శరవేగంగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం
విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News