భారీ వర్షాలు.. ఆర్టీసీ అధికారులకు మంత్రి మండిపల్లి ఆదేశాలివే
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:43 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు రవాణా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ఘాట్ రోడ్డులలో ప్రమాదాలు జరగకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు.
ఉత్తరాంధ్రలో వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అమరావతి నుంచి వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎల్‌నినోపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
తెనాలి రైల్వేస్టేషన్ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం
Read Latest AP News And Telugu News