నిమజ్జనానికి తరలివస్తున్న వినాయక విగ్రహాలు.. ట్యాంక్‌బండ్ వద్ద ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:55 AM
భాగ్యనగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. నవరాత్రులు పూర్తవడంతో నిమజ్జనానికి వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. నవరాత్రులు పూర్తవడంతో నిమజ్జనానికి వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. గణనాథుని నామస్మరణతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. రద్దీకి అనుగుణంగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక బారికేడ్లు, ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో పోలీసులు నిరంతరాయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనదారులు.. పోలీసులకు సహకరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్యాంక్‌బండ్ రూట్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రజలకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
తెనాలి రైల్వేస్టేషన్ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం
‘ది ప్యారడైజ్’ కోసం నాని ప్రత్యేక విజ్ఞప్తి.. సీఎం రేవంత్ స్పందన ఇదే
Read Latest Telangana News And Telugu News