Share News

సికింద్రాబాద్‌ మీదుగా బరౌని(బిహార్‌)కి ఎనిమిది ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Nov 10 , 2026 | 10:38 AM

పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌ మీదుగా బరౌనికి(బిహార్‌) ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్‌ మీదుగా బరౌని(బిహార్‌)కి ఎనిమిది ప్రత్యేక రైళ్లు
Special trains

హైదరాబాద్‌ సిటీ: పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌ మీదుగా బరౌనికి(బిహార్‌) ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబరు 3వ తేదీ వరకు 06587 ప్రత్యేక రైలు ప్రతీ సోమవారం బెంగళూరు నుంచి బరౌనికి, అలాగే 06588 ప్రత్యేక రైలు ప్రతీ గురువారం బరౌని నుంచి బెంగళూరుకు బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city6.2.jpgఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్గమధ్యలో ఈ రైళ్లకు యెలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్‌, రాయచూర్‌, కృష్ణ, వికారాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, బల్లార్ష, నాగ్‌పూర్‌, ఇటార్సి తదితర స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

‘నామినేటెడ్‌’పై కుదరని ఏకాభిప్రాయం?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 10:38 AM