కోచ్ పదవే అత్యంత కష్టం.. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 10:03 AM
క్రికెటర్‌గా ఆడటం, కామెంటేటర్‌గా వ్యవహరించడం కంటే కోచ్‌గా పనిచేయడమే కష్టమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు మైదానంలోకి వెళ్లాక కోచ్ నియంత్రణ ఉండదని, ఆ పదవిలో బాధ్యతలు, ఒత్తిళ్లు ఎక్కువని తెలిపారు.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ఆడటం, కామెంటేటర్‌గా వ్యవహరించడం కంటే కోచ్‌గా పని చేయడం చాలా కష్టమని టీమిండియా క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టి తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై కోచ్‌కు నియంత్రణ ఉండదని, అందుకే ఈ పదవి భారీ బాధ్యత, ఒత్తిళ్లు ఉంటాయని తెలిపారు.
ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిశాస్త్రి.. క్రికెటర్, వ్యాఖ్యాత, హెచ్ కోచ్.. ఈ మూడు పాత్రలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీటిల్లో అన్నింటికంటే కష్టమైనది ఏది అని యాంకర్ అడగ్గా.. కోచింగ్ పదవి క్లిష్టమైనది అని శాస్త్రి తెలిపారు. 'అవును.. అన్నింటికన్నా కష్టమైనది కోచ్ పదవి. ఎందుకంటే, ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టాక ఏదీ కోచ్ అదుపులో ఉండదు. క్రికెటర్‌గా మనం ఆడుతున్నప్పుడు చేతిలో బ్యాట్ లేదా బంతి ఉంటాయి. అలానే కామెంటేటర్‌గా చేస్తున్నప్పుడు చేతిలో మైక్ ఉంటుంది. కానీ కోచ్ విషయంలో.. ఒక్కసారి ఆటగాళ్లు బయటకు వెళ్లాక.. అతడు చేతులు కట్టుకుని కూర్చోవాలి. దీనితో పాటు అపారమైన బాధ్యత కూడా వస్తుంది. దేశం అంచనాలు అలా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. కాబట్టి దాన్ని నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు' అని రవిశాస్త్రి అన్నారు.
కోచ్ పదవి కారణంగా వచ్చే ఒత్తిడి గురించి, అలాగే ఫలితాలను అందించడంలో లభించే సంతృప్తి గురించి కూడా రవిశాస్త్రి తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ' మీకు తెలుసు.. కోచ్ పదవి అంటే మీ తల మీద ఎప్పుడూ తుపాకీ గురిపెట్టి ఉంటుంది. కానీ మీరు దాన్ని విజయవంతంగా పూర్తి చేసి విజయం సాధిస్తే.. అప్పుడు లభించే ప్రతిఫలాలు మాత్రం చాలా సంతృప్తినిస్తాయి. అంతేకాక మీకు అపారమైన గౌరవాన్ని ఇస్తుంది. అంతేకాక, మీరు చేస్తున్న పనిని ఆస్వాదించేలా చేస్తుంది. మరేదీ ఇవ్వలేని ఒక రకమైన సంతృప్తిని కోచ్ పదవి అందిస్తుంది' అని శాస్త్రి అన్నారు. జూలై 2017 నుంచి నవంబర్ 2021 వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పనిచేశారు. అతడి హయాంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో రెండు చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాలతో సహా అనేక ప్రధాన మైలురాళ్లను సాధించింది.
ఇవి కూడా చదవండి:
భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధాన
41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్..
విరాట్‌లో నన్ను చూసుకున్నా..: కేన్ విలియమ్సన్చనలు!