భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధాన
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:55 AM
దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రకటించిన భారత మహిళల టెస్ట్, వన్డే, టీ20 జట్లకు స్మృతి మంధానను కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. దీప్తి శర్మ, షెఫాలీ వర్మ వైస్ కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన బాధ్యతలు స్వీకరించింది. ఇటీవలే హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె తర్వాత వన్డే, టీ20 కెప్టెన్సీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన స్మృతి.. సొంతగడ్డపై జింబాబ్వేతో సిరీస్‌ల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టింది. తాజాగా సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ జట్టులోనూ స్మృతి మంధానను బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దీంతో మంధాన భారత మహిళల జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నిలించింది.
డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ పర్యటనలో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో భారత్ ఏకైక టెస్ట్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9 నుంచి 30 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం బీసీసీఐ మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. గాయంతో ఆసియాకప్‌తో పాటు జింబాబ్వేతో సిరీస్‌లకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ తిరిగి జట్టులో చోటుదక్కించుకుంది. మరోవైపు టెస్ట్, వన్డే ఫార్మాట్‌లకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. టీ20ల్లో మాత్రం షెఫాలీ వర్మ మంధానకు డిప్యూటీగా వ్యవహరించనుంది. జింటిమణి కలితా తొలిసారి టెస్ట్ టీమ్ పిలుపు అందుకుంది. తెలుగు తేజం శ్రీ చరణి మూడు జట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
టెస్ట్ జట్టు:
స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), శ్రీ చరణి, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, నందిని శర్మ, జింటిమణి కలిత, సాయాలి సత్ఘరే.
వన్డే జట్టు:
స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, నందిని శర్మ, జింటిమణి కలిత, సాయాలి సత్ఘరే.
టీ20 జట్టు:
స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ (వైస్ కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, నికీ ప్రసాద్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), అనుష్క శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్, అమన్‌జోత్ కౌర్, క్రాంతి గౌడ్, నందిని శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, సాయాలి సత్ఘరే.
ఇవి కూడా చదవండి:
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్