41 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్..
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:01 AM
షార్జా వేదికగా జింబాబ్వే, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే రెండు ఇన్నింగ్స్‌లోనూ 500 పరుగులను దాటడం విశేషం. ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్ ద్విశతకం సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: షార్జా వేదికగా జింబాబ్వే, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే రెండు ఇన్నింగ్స్‌లోనూ 500 పరుగులను దాటడం విశేషం. ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్ (279 బంతుల్లో 206 నాటౌట్) ద్విశతకం సాధించాడు. ఎర్విన్‌కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఎర్విన్ ద్విశతకానికి తోడు ఆల్‌రౌండర్ వెస్లే మెదవరె కూడా శతకం (108 బంతుల్లో 100)తో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన క్రెయిగ్ ఎర్విన్ అరుదైన ఫీట్ సాధించాడు. జింబాబ్వే తరఫున టెస్టుల్లో ద్విశతకం సాధించిన అతిపెద్ద వయస్కుడిగా ఎర్విన్ నిలిచాడు. అతడి ప్రస్తుత వయసు 41 ఏళ్ల 82 రోజులు. ఓవరాల్ జాబితాలో ఎర్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ ఎరిక్ రోవన్ (42 ఏళ్ల 6 రోజులు) 1951లో ఇంగ్లండ్‌తో టెస్టులో 236 పరుగులు సాధించి తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ జాక్ హాబ్స్ (41 ఏళ్ల 195 రోజులు) 1924లో దక్షిణాఫ్రికాపై 211 పరుగులు సాధించాడు. క్రెయిగ్ ఎర్విన్ మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ బ్యాటర్ హెండ్రెన్ (40 ఏళ్ల 361 రోజులు) 1930లో వెస్టిండీస్‌పై 205 పరుగులతో నాటౌట్ నిలిచాడు. అలానే ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ గ్రహం గూచ్ (40 ఏళ్ల 314 రోజులు) న్యూజిలాండ్‌పై 210 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చివరిరోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 122.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసింది. అఫ్గన్ బౌలర్లలో జియావుర్ అక్బర్ 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ సలీమ్, అబ్దుల్ మాలిక్ చెరొక వికెట్ పడగొట్టారు. బ్రెండన్ టేలర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఇదే షార్జా వేదికగా నవంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్