Share News

హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌లకు నిప్పు.. సీసీటీవీలో రికార్డైన దుండగుల దృశ్యాలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 10:09 AM

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు రెచ్చిపోయారు. సిరి నగర్ కాలనీలో కొందరు వ్యక్తులు.. వాహనాలకు నిప్పుపెట్టడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌లకు నిప్పు.. సీసీటీవీలో రికార్డైన దుండగుల దృశ్యాలు
LB Nagar Bike Fire

హైదరాబాద్, నవంబర్ 10: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు రెచ్చిపోయారు. సిరి నగర్ కాలనీలో కొందరు వ్యక్తులు.. వాహనాలకు నిప్పుపెట్టడం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళ ఇళ్ల ముందు పార్క్ చేసిన రెండు బైక్‌లకు దుండగులు నిప్పుపెట్టారు. మంటల్లో ఒక బైక్ పూర్తిగా దగ్ధమవగా.. మరో బైక్ పాక్షికంగా కాలిపోయింది. అయితే బైక్‌లకు మంటలు అంటుకోవడం గమనించిన స్థానికులు వెంటనే వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఓ బైక్‌ మంటలకు ఆహుతైంది.


బైక్‌లకు దుండగులు నిప్పు పెట్టి పరారవుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గతంలోనూ ఇదే కాలనీలో రెండు కార్లకు దుండగులు నిప్పు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా వాహనాలకు నిప్పు పెడుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమెదు చేశారు.


సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తరచుగా ఇలాంటి ఘటనలు జరగటానికి కారణమేంటి?... ఇది ఆకతాయిల పనా? లేక కక్షపూరితంగా వాహనాలకు నిప్పు పెడుతున్నారా అనేది పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

రాప్తాడు బాలికకు ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతం

లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 10:13 AM