లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 09:41 AM
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొక ప్రాణం బలైంది. పోలీస్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేకపోయాడు. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.
హైదరాబాద్, నవంబర్ 10: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొక ప్రాణం బలైంది. పోలీస్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేకపోయాడు. చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీను(31) అనే వ్యక్తి కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఆన్‌లైన్ లోన్ యాప్‌లో నలభై వేల రుణం తీసుకున్నాడు.
అయితే సకాలంలో రీపేమెంట్ చేయలేకపోయాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు గురిచేశారు. డబ్బులు చెల్లించాలంటూ అసభ్యకరంగా బెదిరింపులకు దిగారు. కుటుంబ సభ్యులకు నగ్న చిత్రాలు పంపుతామంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. వారి వేధింపులు తీవ్రం కావడంతో శ్రీను భరించలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ చివరకు ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సమాచారం అందిన వెంటనే పహాడీషరీఫ్ పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
సుపరిపాలనే కూటమి విజయానికి కారణం
రాప్తాడు బాలికకు ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం
Read Latest Telangana News And Telugu News