Share News

రాప్తాడు బాలికకు ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతం

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:16 AM

‘రాప్తాడు జడ్‌పీ హైస్కూలులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న బాధితురాలికి ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతంగా పూర్తయింది.

రాప్తాడు బాలికకు ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతం

  • పీఐసీయూ నుంచి త్వరలోనే వార్డుకు

  • బాధితురాలి ఆరోగ్య స్థితిపై మంత్రి లోకేశ్‌

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘రాప్తాడు జడ్‌పీ హైస్కూలులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న బాధితురాలికి ప్లాస్టిక్‌ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. పీఐసీయూ నుంచి త్వరలోనే వార్డుకు మారుస్తారు’ అని మంత్రి లోకేశ్‌ తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. ‘చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల బృందం తాజా హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈరోజు ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణులు ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా ఊండ్‌ డీబ్రైడ్‌మెంట్‌ (గాయాలను శుభ్రపరచడం), కుట్లు సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేశారు. గాయాలు వేగంగా మానుతున్నాయని, చిన్నారి ఈ చికిత్సను తట్టుకుని మంచి ధైర్యాన్ని ప్రదర్శించిందని వైద్యులు వెల్లడించారు.

కోలుకునే ప్రక్రియలో భాగంగా చిన్నారి ఎడమ చేతికి వేసిన స్లింగ్‌ను తొలగించారు. దీంతో ఆమె మళ్లీ చెయ్యి కదిలించడం ప్రారంభించే అవకాశం కలిగింది. ప్రస్తుతం నొప్పి నివారణ మందులతోపాటు ప్రత్యేక ఆహార సహాయాన్ని(ఫీడింగ్‌ సపోర్ట్‌) కొనసాగిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పీఐసీయూ నుంచి జనరల్‌ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య బృందం స్పష్టం చేసింది. చిన్నారి త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు’ అని మంత్రి లోకేశ్‌ వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 06:18 AM