పల్లెపోరుకు వేళాయె!
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:50 AM
పల్లెపోరుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పురపోరు, పరిషత్ పోరు పూర్తి కావ డంతో పల్లెపోరుకు గ్రామ పంచాయతీ అధి కారులు సమాయత్తమవుతున్నారు. అయా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తమవు తున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల రాజకీయ వేడి మొదలైంది.
మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు
13,16,19 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ
15,18, 21 తేదీల్లో జిల్లాలో నామినేషన్ల స్వీకరణ.. చివరి తేదీలు 17,20,23
ఉపసంహరణకు చివరి తేదీలు 21,24,27.. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన
నవంబరు 26, 29, డిసెంబరు 2 తేదీల్లో పోలింగ్ ప్రక్రియ.. ఫలితాలు వెల్లడి
అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు.. 27, 30, 3 తేదీల్లో రీ పోలింగ్
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)
పల్లెపోరుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పురపోరు, పరిషత్ పోరు పూర్తి కావ డంతో పల్లెపోరుకు గ్రామ పంచాయతీ అధి కారులు సమాయత్తమవుతున్నారు. అయా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తమవు తున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల రాజకీయ వేడి మొదలైంది.
రాష్ట్రంలో 2026 స్థానిక సంస్థల రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబరు 14న షెడ్యూ లు విడుదల చేసింది. తొలి దశకు నవంబరు 13న, రెండో దశకు 16న, మూడవ దశకు 19న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ల ఆధారంగా జిల్లా పరిధిలో ఎన్నికల అధికారులు నవంబరు 15, 18, 21వ తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అదేరోజు నామినేషన్ల స్వీక రణ ప్రారంభమవుతుంది. మూడు దశలకు సంబంధించి నామి నేషన్ల స్వీకరణకు నవంబరు 17,20,23 తేదీలు చివరి తేదీ లుగా నిర్ణయించారు. 18,21, 24 తేదీల్లో నామినేషన్ల పరి శీలిస్తారు. తిరస్కరించిన నా మినేషన్లపై అప్పీలు స్వీకరణ, పరిష్కారం అనంతరం అభ్య ర్థిత్వాల ఉపసంహరణకు నవంబ రు 21,24,27 చివరితేదీలు కాగా అదే తేదీల్లోనే పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలలో భాగంగా నవంబరు 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో పోలింగ్ నిర్వహించి ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు. రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే నవంబరు 27, 30, డిసెంబరు 3వ తేదీల్లో నిర్వహిస్తారు. జిల్లాకు సంబంధించి 544 పంచాయతీల్లో 5,696 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 12,96,519 మంది తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 6,35,768 మంది కాగా మహిళా ఓటర్లు 6,60,708 మంది, ఇతర ఓటర్లు 43 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సిబ్బంది నియామకాలు చేపట్టటం జరిగింది, పోలింగ్ కేంద్రాలను గుర్తించి, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
జూ మొదటి దశలో బుట్టాయిగూడెం, జంగారెడ్డి గూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి.నరసాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని 177 పంచాయతీలకు, రెండవ దశలో భీమడోలు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాల్లోని 194 పంచాయతీలకు, మూడ వ దశలో దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లోని 173 పంచాయతీ లకు ఎన్నికలు జరుగుతాయి.
గుర్తులు కేటాయింపు
సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం పోటీ చేసే అభ్యర్థులకు గుర్తు లను రాష్ట్ర ఎన్నికల సం ఘం కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థుల కోసం 25, వార్డు అభ్యర్థుల కోసం 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్య ర్థులకు మంచ ము, కత్తెర, ఉంగ రము, బుట్ట, వం కాయ, కప్పు–సాసరు, క్యారెట్, తాళం– చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, దూరవాణి, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్ళు, తిరగలి, కుండ, అరటి పండు, కొవ్వొత్తులు, నల్ల బోర్డు , అనాసపండు, షటిల్, చేతి కర్ర, చెంచా వంటి గుర్తులను కేటా యిం చారు. వార్డు అభ్యర్థులకు ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూలు, ఇస్త్రీపెట్టె, పోస్టు డబ్బా, గ్యాస్ పొయ్యి, బీరువా, ఐస్క్రీం, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటిన్నా, రంపం, కెమేరా, క్యారమ్బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్ట్, కోటు గుర్తులను కేటాయించారు.
ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం
పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పంచాయతీ అధికారులు ఎన్నికల పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 544 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పరిషత్ ఎన్నికలతో గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత వేడెక్కనుంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ప్రధాన రాజకీయ పక్షాలు కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఉన్న అధికార పక్ష కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకత్వంతో సమీక్షలు నిర్వహిస్తోంది. పంచాయతీ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే ఆశావహులు తమ బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆయా రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులను ఖరారు చేయడానికి రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.