రహదారుల పునరుద్ధరణకు 870.90 కోట్లు
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:14 AM
మురసు తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆర్‌ఆండ్‌బీ శాఖ పరిధిలో 1302 కిలోమీటర్లమేర రహదారులు దెబ్బతిన్నాయని..
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి
బనగానపల్లె, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆర్‌ఆండ్‌బీ శాఖ పరిధిలో 1302 కిలోమీటర్లమేర రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ‘‘రహదారుల తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.98.70 కోట్లు, శాశ్వత పనులకు రూ.772.22 కోట్లు అవసరం. మొత్తం పనులకు రూ.870.90 కోట్ల వ్యయం అవుతుంది.’’ అని వెల్లడించారు. బనగానపల్లెలో సోమవారం మంత్రి మాట్లాడారు. మురసు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 158 చోట్ల రోడ్లు కోతకు గురికాగా, వాటిలో 141చోట్ల మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ప్రజల రవాణాకు ఇబ్బందులు లేకుండా దెబ్బతిన్న రహదారులకు యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: