భారత్‌లో దీపావళి వల్లే లాహోర్‌లో కాలుష్యం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Nov 10 , 2026 | 09:58 AM
భారత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా కాల్చిన బాణసంచా కారణంగానే పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో వాయు కాలుష్యం పెరిగిందని పంజాబ్ రాష్ట్ర సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా కాల్చిన బాణసంచా కారణంగానే పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో వాయు కాలుష్యం పెరిగిందని పంజాబ్ రాష్ట్ర సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఆరోపించారు. భారత నగరాల నుంచి వచ్చిన పొగ, పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వెలువడిన కాలుష్య కారకాలు లాహోర్‌ను కమ్మేశాయని పేర్కొన్నారు. 8న దీపావళి వేడుకల సందర్భంగా భారతదేశంలోని పలు నగరాల్లో బాణసంచా కాల్చడంతో వెలువడిన పొగ తూర్పు దిశ నుంచి లాహోర్‌లోకి ప్రవేశించిందన్నారు (Pakistan Air Pollution).
అమృత్‌సర్, లూధియానా, జలంధర్, పాటియాలా, భటిండా, ఫిరోజ్‌పూర్ వంటి నగరాల నుంచి కాలుష్యంతో కూడిన గాలులు లాహోర్ వైపు వీచాయని ఆమె తెలిపారు. దీని కారణంగా నవంబర్ 8న నగరంలో వాయు నాణ్యత మరింత దిగజారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. దీపావళి బాణసంచాతో పాటు పంట కోత అనంతరం వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం కూడా కాలుష్యానికి కారణమని ఆరోపించారు (Diwali Firecrackers).
దీపావళి సమయంలో లాహోర్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది (Lahore AQI). పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 600 మార్కును దాటింది. నవంబర్ 9 ఉదయం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. నగరంలోని కొన్ని పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 1,000కు పైగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడింది. గాలి వేగం పెరగడం, గాలి దిశ మారడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడం, ప్రభుత్వం చేపట్టిన కాలుష్య నియంత్రణ చర్యలతో ఏక్యూఐ తగ్గినట్లు మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..