హైదరాబాద్‌లో కారు బీభత్సం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:02 AM
భాగ్యనగరంలోని రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా పిల్లర్ నంబర్ 165 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సడన్ బ్రేక్ వేసిన కియా కారును వెనుక నుంచి బలంగా మరో కారు ఢీకొట్టింది.
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా పిల్లర్ నంబర్ - 165 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సడన్ బ్రేక్ వేసిన కియా కారును వెనుక నుంచి బలంగా మరో కారు ఢీకొట్టింది.
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కియా కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ కారు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకుని, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుకు అడ్డంగా కియా కారు పడిపోయింది. ఈ ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. సమాచారం అందగానే రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం
క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 679 బ్రాండ్ల ధరల తగ్గింపు
ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News