భాగ్యలక్ష్మి అమ్మవారి వెండి నాణేల కోసం పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 09 , 2026 | 01:53 PM
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి ప్రజలు తరలివస్తున్నారు.
హైదరాబాద్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం (Charminar Bhagyalakshmi Temple) వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి ప్రజలు తరలివస్తున్నారు. నిన్న (ఆదివారం) చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో 7 గంటలకు ఖజానా పంపిణీని ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు.
గుల్జారా హౌస్ 500 మీటర్ల వరకు భక్తుల క్యూ లైన్స్ కిక్కిరిశాయి. ఈ క్రమంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు, సిరిసంపదలూ కలుగుతాయని భక్తులు నమ్మకంగా భావిస్తారు. ఈ నాణేలను సొంతం చేసుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మూడు రోజుల పాటు అమ్మవారి ఖజానాను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు కాయిన్స్ పంపిణీ కొనసాగనుందని ఆలయ కమిటీ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి
సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News