ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:36 AM
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.
రంగారెడ్డి జిల్లా, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. సమాచారం అందగానే రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచింతల్‌లో చెట్లు నాటే పనికి పలువురు వెళ్లి తిరిగి మొయినాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్పా జంక్షన్ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ అవుతుండగా ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సురేశ్, పెంటయ్య, లింగరాజు శెట్టి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
దీపావళి కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News